దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. వాట్ నెక్ట్స్ ఎంటైర్టెన్మెంట్స్ పేరుతో ఓ సంస్థను స్ధాపించి తొలి ప్రయత్నంగా ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు. అనిష్ కథానాయకుడిగా, మహేశ్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయిక. ఆదివారం ‘సోల్ ఆఫ్ అర్జున’ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. అగ్రహీరో నాగార్జున వాయిస్ ఓవర్‌తో కవితాత్మకంగా ఈ గ్లింప్స్ మొదలైంది. ప్రేమ స్వచ్ఛతలోని లోతును ఆయన మాటలు గొప్పగా ఆవిష్కరించాయి. ఆ వర్ణనలోనే అర్జున పరిచయం అవుతాడు.
‘అర్జున మాట్లాడలేడు. కానీ నిశ్శబ్దం అతనిని బలహీనపరచదు.. అతని భావోద్వేగాలను తగ్గించదు..’ అంటూ హీరోలోని ధైర్యాన్ని, బలాన్ని ఈ టీజర్ ద్వారా ఆవిష్కంచారు మేకర్స్. డెబ్యూ హీరోగా అనిష్ ఆట్టుకునే నటన కనబరిచాడు. ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. కేవలం భావ వ్యక్తీకరణ, శారీరక భాషతోనే అతను ఈ కథను మోయడం ప్రశంసనీయం అని మేకర్స్ చెబుతున్నారు. గ్లింప్స్‌లో యాక్షన్ షాట్స్ కూడా ప్రశంసనీయంగా ఉన్నాయి. కథానాయిక అనస్వర రాజన్ చక్కని స్క్రీన్ ప్రెజన్స్‌తో ఫ్రేమ్‌లో తాజాదనాన్ని నింపింది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా సహజంగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: రాజా మహాదేవన్, సంగీతం: తమన్.