బుల్లితెర బిగ్ రియాలిటీషో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. గత వారం అనీ మాస్టర్ హౌజ్ నుండి బయకు వచ్చేసింది. కొన్ని టెలివిజన్ రియాలిటీ డాన్స్ షో లలో జడ్జ్ గా కొనసాగిన అనీ మాస్టారు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ షోతో మరింత దగ్గరయ్యారు. మొదట్లో కొంత నిదానంగానే కొనసాగిస్తూ వచ్చారు. కాని తర్వాత తర్వాత తనకు అడ్డొచ్చిన వారిపై మాటల తూటాలు పేలుస్తూ తెగ వార్తలలో నిలుస్తూ వచ్చింది.
బిగ్ బాస్ తో అనీ మాస్టర్ రోజుకు రూ.50 వేల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కాబట్టి ఆమెకు వారానికి 3.5 లక్షలు సంపాదించుకున్నారు. ఇక ఈ సంఖ్య నిజమైతే, సెప్టెంబర్ 5 మరియు నవంబర్ 20 మధ్య, అనీ మాస్టర్ సంపాదించిన మొత్తం మొత్తం రూ. 40 లక్షలని తెలుస్తోంది. మొత్తానికి అనీ మాస్టర్ ఈ షో వలన బాగానే లాభపడిందని అంటున్నారు.
అనీ మాస్టర్ చాలాసార్లు డేంజర్ జోన్లో ఉండగా, అదృష్టవశాత్తు సేవ్ అవుతూ వచ్చింది . 10వ వారం నుంచి ఆమె వెళ్ళిపోతుంది అనే కామెంట్స్ అయితే చాలానే వినిపించాయి. మధ్యలో జెస్సి అనారోగ్యంతో బయటకు వెళ్ళిపోవడం తో మరో వారం ఉండేందుకు ఆనీ మాస్టర్ కు దోహదపడింది. ఎట్టకేలకు పదకొండో వారంలో ఎలిమినేట్ చేయబడింది .ఇక పన్నెండవ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయబడిన పోటీదారులు షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ, సిరి, సన్నీ, కాజల్, రవి మరియు ప్రియాంక ఉండగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది.