Santosham Awards | ప్రముఖ జర్నలిస్ట్, సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సంతోషం అవార్డ్స్ కార్యక్రమానికి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన సురేష్ కొండేటి, ఈ అవార్డుల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందించారు.
గత 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహించడానికి సంతోషం మ్యాగజైన్ అవార్డులను అందిస్తోంది. ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ మరియు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారు.
సినీ పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉండే చంద్రబాబు, ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహిస్తాయని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. సూర్య సిమెంట్స్, విజయ వారాహి మూవీస్, వీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరియు వెన్ లాక్ గ్రూప్ సంస్థలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి. ఈసారి అవార్డ్స్ వేడుక టాలీవుడ్‌తో పాటు మిగతా అన్ని పరిశ్రమల నుంచి మంచి సహకారంతో ఘనంగా నిర్వహించబడుతుందని సురేష్ కొండేటి తెలిపారు.
‘సంతోషం అవార్డ్స్’కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సురేష్ కొండేటి….
*Andhra Pradesh CM Chandrababu Invited to ‘Santosham Awards’ by Suresh Kondeti* @ncbn Garu Convey his best wishes
Biggest #SantoshamSouthIndianFilmAwards2025 & #SantoshamOttAwards2025⏳🔥
🗓️ August 16th… pic.twitter.com/a36RaA2ciC
— Suresh Kondeti (@santoshamsuresh) August 12, 2025