Andhra King Taluka | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్నతాజా ప్రాజెక్ట్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. RAPO 22గా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేం మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ లాంచ్ అప్డేట్ అందించారు. ఈ పాటను సెప్టెంబర్ 8న లాంచ్ చే్స్తున్నట్టు ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ రామ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ మూవీలో రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ టాప్ హీరో ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్నాడు. ఆంధ్ర కింగ్ తాలూకా గ్లింప్స్‌లో సినిమా రిలీజ్ రోజు తన అభిమాన హీరో స్టైల్‌ను అనుకరిస్తూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ‘ఆంధ్రాకింగ్ ఫ్యాన్స్ తాలూకా..’ అంటూ యాభై టిక్కెట్లు అడగగానే.. మేనేజర్ టిక్కెట్లు ఇస్తాడు. దాంతో రామ్ ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు చేసుకుంటాడు. అభిమాని పాత్రలో రామ్ నయా అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Fans…College…Mad fun!
“Aiyayayayooo poooyeee arey PUPPY SHAME ae aayyeee”#AndhraKingTaluka second single is #PuppyShame 🐶
Out on 8th September 💥
Music by @iamviveksiva & @mervinjsolomon#AKTOnNOV28 pic.twitter.com/ugxSIyEHja
— RAm POthineni (@ramsayz) September 4, 2025
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్