రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఓ హీరో అభిమాని కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని రెండో పాట ‘పప్పీ షేమ్..’ను ఈ నెల 8న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూడటం కోసం థియేటర్ వద్ద సందడి చేస్తున్నట్లుగా హీరో రామ్ కనిపిస్తున్నారు. వినోదంతో పాటు హై ఇంటెన్సిటీ యాక్షన్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీబోర్సే, రావు రమేష్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్-మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌బాబు.పి.