Fursat Restaurant | టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న క్యాపిటల్ పార్క్‌లో తన స్నేహితులు శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి ‘ఫుర్సత్’(Fursat Restaurant) అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. తనకు భోజనం అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా బిర్యానీ, చికెన్ కర్రీలతో పాటు వెజిటేరియన్ వంటకాలను కూడా ఆస్వాదిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి ప్రశాంతంగా గడిపేలా, ఒక మంచి అనుభూతిని అందించేలా ఫుర్సత్‌ను తీర్చిదిద్దినట్లు ఆమె వివరించారు.
ఈ రెస్టారెంట్లో సుమారు 300 మంది కూర్చునే సదుపాయంతో పాటు ప్రత్యేకమైన బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నల్లి గోష్ట్ బిర్యానీ (Nalli Gosht Biryani) వంటి ప్రత్యేక వంటకాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని శ్రీముఖి పేర్కొన్నారు. భాగస్వాములు శ్రావణ్, ఆనంద్, రవి మాట్లాడుతూ.. రుచి, సేవలలో ఎక్కడా రాజీ పడకుండా సంప్రదాయ, ఆధునిక వంటకాల కలయికతో మెనూని రూపొందించామని చెప్పారు. కార్పొరేట్ సమావేశాలకు, కుటుంబ వేడుకలకు ఫుర్సత్ ఒక ఉత్తమ గమ్యస్థానంగా మారుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. వినూత్నమైన డైనింగ్ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ రెస్టారెంట్, శ్రీముఖి భాగస్వామ్యంతో హైదరాబాద్ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.