Rajamouli – Rashmi Video | దిగ్గజ దర్శకుడు రాజమౌళి, యాంకర్ రష్మికి సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మా టీవీ(ఇప్పుడు స్టార్ మా) వేదికగా అప్పట్లో ‘యువ’ అనే సీరియల్ వచ్చింది. ఈ సీరియల్లో వాసు, విశ్వ, కృష్ణుడు, యాంకర్ రష్మి గౌతమ్, కరుణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సీరియల్‌ను నిర్మించగా.. సబీహ ఈ సీరియల్‌కి దర్శకత్వం వహించారు. 2008లో ఈ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ ప్రమోషన్స్ కోసం రాజమౌళితో పాటు అనుష్కాను నటించమని నాగార్జున కోరగా.. ఇద్దరు యాక్సెప్ట్ చేయడంతో పాటు యువ సీరియల్లో కామియో పాత్రలో నటించారు.
ఇందులో భాగంగానే రాజమౌళి రష్మి కలిసి నటించారు. వీరిద్దరిపై ఒక సరదా లవ్ ట్రాక్ ఉంటుంది. ఐ లవ్ యూ అంటూ రాజమౌళికి రష్మికి ప్రపోజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు అనుష్కా కూడా ఇందులో నాగలక్ష్మి అనే పాత్రలో మెరిసింది.
Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025
#Anushkashetty Cameo in #Yuva Serial 🫰pic.twitter.com/pzJB3NU7dh
— Milagro Movies (@MilagroMovies) February 19, 2025