Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా, నటిగా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఇక ఇంటర్వ్యూలలో ఆమె ఏ విషయంపైనైన చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంది. తాజాగా తన భర్తకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది మా ఆయన పర్ఫెక్ట్ అని అందరు అనుకుంటారు. కాని ఆయన కూడా అందరి మగాళ్లలాగే . మా ఇద్దరి మధ్య కూడా కొన్ని సందర్భాలలో గొడవలు అయ్యాయి. నేను వెళ్లి కొంతమందిని కలవడం. కొంతమందితో సినిమాలు చేయడం ఆయనకి నచ్చలేదు.
ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నేను హీరోలతో.. పెద్ద పెద్ద స్టార్లతో.. గుడ్ లుకింగ్ పీపుల్స్‌తో ఇంట్రాక్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అబ్బాయిల మనస్తత్వమే అది. నన్ను ఫ్లర్ట్ చేయడం కావచ్చు.. కాంప్లిమెంట్ కావచ్చు.. ఆయన తీసుకోలేరు. సాధారణంగా అందరు కూడా అనసూయ భర్త అన్నీ చేయనిస్తాడు, అన్నింటికి ఒప్పుకుంటాడు అని అందరు అనుకోవచ్చు. వాడు చేతకాని వాడు అని కూడా అంటారు. అదృష్టం ఏంటంటే మా ఆయనకి తెలుగు రాదు. సోషల్ మీడియాలో కామెంట్స్ పట్టించుకోడు. ఆయనలా ఉండాలని ఎన్నోసార్లు అనుకుంటాను.
నేను మా ఆయనతో ఉన్నట్టు వేరే వాళ్లతో ఉండలేను. నాకు వేరే వ్యక్తి బ్యాడ్‌గా అనిపిస్తే.. నేను అతనికి బ్యాడ్‌గా కనిపిస్తా. అది హ్యూమన్ బిహేవియర్ అంతే. నేను కూడా మా ఆయనతో ఇన్సెక్యురీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అనసూయకి అసూయ అనేది వాళ్ల ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్‌ని. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు అని అనసూయ పేర్కొంది. ఇక మన అన్నతో మనకి విడాకులు ఉండవు. అమ్మతో విడాకులు ఉండవు.. అక్కతో ఉండవు. కానీ కేవలం భార్యతోనే ఉంటుంది. పెళ్లి అనే దానికి మన భారతీయ సాంప్రదాయంలో ఇచ్చేటంత గౌరవం మరెక్కడ కూడా ఇవ్వరు. అయితే ఈ మధ్య విడాకుల వలన విలువలు తగ్గించుకుంటున్నారు. ఓపిక,అడ్జెస్ట్మెంట్ వల్లనే బంధాలు నిలబడతాయి. ఈ జనరేషన్ వారికి అంత ఓపిక లేదని అనసూయ పేర్కొంది.