Anasuya | యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అనసూయ ఇప్పుడు నటిగా రాణిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర అనసూయ ఫేట్‌ని మార్చింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అనసూయకి వరుస అవకాశాలు రావడం, వాటితో తన సత్తా నిరూపించుకోవడం మనం చూశాం. పుష్ప ఫ్రాంచైజీలో దాక్షాయణి అనే పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది అనసూయ. ఇక ఇప్పుడు టీవీ షోలలో జడ్జిగా కూడా సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి రచ్చ పీక్స్‌లోనే ఉంటుంది. షార్ట్ డ్రెస్సులు, నెక్ లెస్ బ్లౌజ్, టాప్ లెస్ డ్రెస్సులతో తన అందాలన్ని చూపిస్తూ అబ్బాయిలకు నేత్రానందాన్ని కలిగిస్తుంది
ఇక ఇద్దరు పిల్లలు, భర్తతో హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్న ఈ అమ్మడు ఖాళీ సమయాలలో విహార యాత్రలకి కూడా వెళుతుంటుంది. సమ్మర్ వెకేషన్లో భాగంగా అనసూయ ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చిన్న పిల్లలా మారి జింకలు, ఏనుగులతో కలిసి సందడి చేస్తుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు అనసూయ శ్రీలంక టూర్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని పాటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసింది అనసూయ. పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ కు ఉపనయనం అంటూ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని కూడా షేర్ చేసింది. ఇక హోమం రోజు తన ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడంటూ ఎమోషనల్ అయింది. ఇదంతా ఒక ఎత్తయితే, రీసెంట్గా సంప్రదాయ చీరకట్టులో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, దాని వెనుక ఉన్న కష్టాలను సిగ్గుపడకుండా చెప్పింది. ఈ చీరకట్టులో ఉన్న అందం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అయితే వెనుక కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పదహారు గంటల సుదీర్ఘ షూటింగ్ సమయంలో, సరైన టైమ్ కు బాత్రూమ్ కి వెళ్లలేని ఇబ్బంది కలుగుతుంది. అయిన కూడా ఈ పోరాటంలో ప్రతి అంశం నాకు ఎంతో విలువైంది అని చెప్పుకొచ్చింది.