Prema Vimanam | సంగీత్ శోభన్, శాన్వి మేఘన లీడ్ రోల్స్ లో నటిస్తున్న జీ 5 వెబ్ ప్రాజెక్ట్ ప్రేమ విమానం (Prema Vimanam). సంతోష్ కట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనసూయ భరద్వాజ్ (Anasuya), వెన్నెల కిశోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, కల్పలత, సుప్రీత్, శైలజప్రియ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ టీజర్, ట్రైలర్ మంచి స్పందన రాబట్టుకుంటోంది.
విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 13న Zee5 ప్రీమియర్ కానుందని తెలియజేస్తూ.. ఓ వీడియో షేర్ చేసింది అనసూయ. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, జీ5తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రేమ విమానం చిత్రానికి జగదీష్ చీకటి కెమెరామెన్.
Story of a naughty pair of kids & a beautiful love track to hit OTT screens very soon. Trailer is promising🔗 https://t.co/vUTDKlnjIF#PremaVimanamOnZee5 on 13 Oct@AbhishekPicture @ZEE5Telugu @saanvemegghana @santoshkata@anusuyakhasba @vennelakishore@anuprubens pic.twitter.com/fJL7e7jaQC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 8, 2023
ప్రేమ విమానం ట్రైలర్..