Anasuya | ఈ మధ్య ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా మోసాల బారిన పడతున్నారు. తాజాగా అందాల నటి అనసూయ తాను మోసపోయినట్టు చెప్పి షాకిచ్చింది. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా సత్తా చాటుతుంది. తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ఆమె పోషించిన ‘రంగమ్మత్త ‘ పాత్ర అనసూయ కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ పిక్స్ కూడా షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది. తాను ఓ ఆన్లైన్ మోసానికి గురయ్యానని చెప్పి, ఆ అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. గత నెల she Truffle India అనే క్లాతింగ్ వెబ్సైట్లో దుస్తులను ఆర్డర్ చేసిందట అనసూయ. అయితే ఆర్డర్ సమయంలో ముందే డబ్బులు చెల్లించింది .కానీ ఇప్పటివరకు వస్తువులు రాకపోగా, రీఫండ్ కూడా కాలేదు.. దీంతో సొంతంగా దుస్తులు అమ్ముతున్నామంటూ డబ్బులు కాజేస్తున్నారు అంటూ ఆ వెబ్‌సైట్‌పై మండిపడింది. ఈ విషయాన్ని మొదట బయటపెట్టకూడదని అనుకున్నాను, కానీ ఇతరులు తన మాదిరిగా మోసానికి గురవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశానని అనసూయ వివరించింది.
ఇలాంటి ఆన్లైన్ మోసాలు అనసూయకే కాక, ఎన్నో మందికి ఎదురవుతున్నాయి. డిజిటల్ లైఫ్ పెరుగుతున్న కొద్దీ, ఫేక్ వెబ్సైట్లు, మోసపూరిత సేవల నుంచి వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరుగుతోంది.ఇక ప్రస్తుతం అనసూయ రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో పలు రియాలిటీ షోలలోనూ కనిపించి సందడి చేస్తుంది. చివరగా పుష్ప 2 సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించి మెప్పించిన విషయం తెలిసిందే.