Ananya Pandey | సినీరంగంలో ప్రముఖులు డేటింగ్ చేయడం కలిసి షికారుకు వెళ్ళడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఇలా చాటు మాటు ప్రేమాయణం జరిపిన వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయితే కొన్ని జంటలు పెళ్ళి వరకు ప్రయాణాన్ని సాగిస్తే మరి కొన్ని జంటలు మాత్రం మధ్యలోనే ఆ ప్రయాణాన్ని ముగిస్తుంటారు.బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో ఓ జంట ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా నడిపిస్తున్నట్లు సమాచారం.
‘ధడక్’చిత్రంతో బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఇషాన్ ఖట్టర్. ఈయన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు. ఇప్పటివరకు ఈయన నటించినవి రెండు మూడు సినిమాలే అయినా నార్త్‌లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈయన ‘లైగర్’ భామ అనన్యపాండేతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ నటుడు చంకీపాండే తనయికగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. నార్త్ టూ సౌత్ ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 21.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇషాన్-అనన్య ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ళిద్ధరూ కలిసి ‘ఖాలీ పీలీ’ అనే లవ్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించారు. అప్పటి నుంచే విళ్ళీదరి మధ్య ప్రేమ ఏర్పడిందని సమాచారం.
వీరిద్దరూ పార్టీలకు పబ్బులకు తిరుగుతూ చాలా సార్లు మీడియా కంటపడ్డారు. ఇషాన్ తల్లి నిలీమా కూడా అనన్య తన కుటుంబంలో మెంబర్ అని చెప్పింది. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అనన్య పాండే ప్రస్తుతం ‘లైగర్’ సినిమాలో విజయ్‌కు జోడిగా నటిస్తుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.