Lenin Movie | టాలీవుడ్ యువ హీరో అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్లో ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కొట్టాలని ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, తన తదుపరి సినిమాల విషయంలో అఖిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఒక కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ తాజా చిత్రం పేరు ‘లెనిన్’.
ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే నుంచి టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయగా.. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా.. ఆ సాంగ్‌ని బాలీవుడ్ నటి అనన్య పాండేతో చేయిస్తే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.