అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాజా రామ్మోహన్ చల్లా దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. శ్రీకాకుళం భాష యాస ఇతివృత్తంతో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘సున్నితమైన భావోద్వేగాలకు వినోదాన్ని జోడించి ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిస్తున్న చిత్రమిది. డిటెక్టివ్‌గా వెన్నెలకిషోర్ పాత్ర వినోదాత్మకంగా వుంటుంది.అనన్య నాగళ్ల పాత్ర కూడా పూర్తి వైవిధ్యంగా వుంటుంది’ అన్నారు. కాలకేయ ప్రభాకర్, సియాగౌతమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.