‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయిక అనంతిక చీరకట్టులో అందంగా కనిపిస్తున్నారు.
పొయెటిక్ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రమిదని.. ప్రేమ, ఎడబాటు, వేదన ప్రధానాంశాలుగా ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర బృందం పేర్కొంది. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.