ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివంగి’. నరేష్ బాబు పి నిర్మాత. ఈ నెల 7న విడుదలకానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అందరి జీవితంలో గుడ్డే, బ్యాడ్డే అని ఒక రోజు ఉంటుంది.
కానీ నా జీవితంలో రెండూ ఓకే రోజు జరిగాయి’ అంటూ ఆనంది చెప్పిన సంభాషణతో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ఫుల్ పాత్రలో కనిపించింది.మహిళా ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమని, రివేంజ్ నేపథ్య కథాంశమని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఏ.హెచ్.కాషిప్, ఎబినేజర్పాల్ సంగీతాన్నందించారు.