Anand Devarakonda | టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రౌడి బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక గతేడాది బేబి (Baby) సినిమాతో బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూయెట్’ (Duet). ఈ సినిమాలో కథానాయికగా రితిక నాయక్ నటిస్తోంది. అయితే నేడు రితికా నాయక్ పుట్టినపోజు సందర్భంగా మూవీ నుంచి ఆమెకు బర్త్‌డే విషెసె తెలుపుతూ.. స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో రితికా ఇషా అనే పాత్రలో నటించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ పోస్టర్లో పెళ్లి కూతురు గెటప్‌లో రితికా ఉండగా.. బీచ్ పక్కన కుర్చుని సిగరెట్ తాగుతూ కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Introducing The Beautiful & Talented @RiktikaNayak_ As EESHA ❤️🔥
Team #DUET Wishes Her A Fabulous Birthday! ❤️#HBDRitikaNayak ✨
First Look Dropping Soon! 🤩@StudioGreen2 @GnanavelrajaKe @madhurasreedhar #AnandDeverakonda @RitikaNayak_ @gvprakash @mithukrish12 pic.twitter.com/Rjrcf6h4up
— Official Srinu (@OfficialSreeNu) October 27, 2024