PawanKalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (PawanKalyan) కుటుంబ సమేతంగా విమానంలో నేడు ఢిల్లీ బయలుదేరారు. జనసేన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా ఢిల్లీకి పయనమయ్యాడు. నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ భేటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. ఈ సమవేశంలో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కుటుంబ సమేతంగా ఢిల్లీకి బయలుదేరాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో తన సతీమణి అన్నా లెజ్నెవాతో పాటు కొడుకు అకిరా నందన్ ఉన్నారు.