మలయాళ అగ్రనటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందుతున్న బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. 1950ల నాటి మద్రాస్.. సినిమా స్వర్ణయుగం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సముద్రఖని కీలక పాత్రధారి. నవంబర్ 14న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘అమ్మడివే..’ అంటూ సాగే ఓ క్లాసిక్ రొమాంటిక్ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ఝాను చందర్ స్వరపరిచగా, ప్రదీప్ కుమార్ ఆలపించారు. నాయకానాయికల కెమిస్ట్రీని, వింటేజ్ లవ్‌స్టోరీని ఈ పాట అద్భుతంగా ప్రజెంట్ చేస్తోందని మేకర్స్ తెలిపారు. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డానీ సాంచెజ్ లోపెజ్, నిర్మాణం: స్పిరిట్ మిడియా ప్రై.లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్.