కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)-17 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన భారత రక్షణ దళాల ప్రతినిధులతో ముచ్చటించారు. ఇండియన్ ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇండియన్ నేవీ కమాండర్ ప్రేరణ దియోస్థలీ హాట్ సీట్లో కూర్చొని అమితాబ్ బచ్చన్‌తో సంభాషించారు. దానికి సంబంధించిన ప్రోమోను సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
ఆ ప్రోమోలో సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్ సరైన సమాధానమన్నారు. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్‌ను ముగించామని వ్యోమికా సింగ్ వివరించగా, ఏ ఒక్క పౌరుడికి హానీ కలుగకుండా పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది టెర్రర్ క్యాంపులపై దాడులు విజయంతం చేసినట్లు ప్రేరణ దియోస్థలీ పేర్కొన్నారు. ఇది కొత్త ఆలోచనలతో కూడిన భారతదేశమని సోఫియా ఖురేషి తెలుపగా షోలోని ఆడియన్స్‌తో పాటు అమితా బచ్చన్ కూడా ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ పూర్తి ఎపిసోడ్ మరికొద్దిరోజుల్లో ప్రసారం కానునట్లు సమాచారం.