Amitabh Bachchan | కోట్లాది అభిమానుల ఆరాధ్యనటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఆయన చేరినట్టు తెలుస్తున్నది. తాజాగా ఆయన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఆ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిగ్‌బీ హాస్పిటల్లో చేరడానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి’లో అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.