Amitabh bachchan| బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.బాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ, ఈ వయసులో కూడా అలుపన్నది లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్, అడ్వర్టైజింగ్ ఒప్పందాలు ఇలా అమితాబ్ బాగానే సంపాదిస్తున్నారు. 82 ఏళ్ల వయసులోనూ అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం గొప్ప విషయమే. కొద్ది రోజుల క్రితం కల్కి చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషించి అదరహో అనిపించాడు. ఆ పాత్రలో అమితాబ్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేలా ఆయన నటించారు. ఇప్పుడు అమితాబ్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.
82 ఏళ్ల వయస్సు ఉన్న అమితాబ్ ఏడాది సంపాదన అక్షరాలా 350 కోట్ల రూపాయలు. 2024-25 సంవత్సరానికి 120 కోట్లు వార్షిక పన్ను చెల్లించాడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించిన మేటి నటుడిగా రికార్డులకి ఎక్కారు అమితాబ్. ఏడాది కాలంలో 350కోట్లు ఆర్జించి 120కోట్ల పన్ను చెల్లించారనే విషయం తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. అడ్వాన్స్ ట్యాక్స్ కింద ఇప్పటికే రూ. 52.50 కోట్లు చెల్లించినట్లు సమాచారం.బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ని వెనక్కి నెట్టి దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీగా నిలిచినట్టు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. షారూఖ్ గత ఏడాది రూ.92 కోట్ల ట్యాక్స్‌తో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని బిగ్ బీ బ్రేక్ చేశాడు.
అమితాబ్ ఈ వయస్సులో కూడా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, రియల్ ఎస్టేట్ సహా వివిధ కంపెనీల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. అందుకే అంత పన్ను చెల్లించారు. పన్ను చెల్లింపుల్లో అమితాబ్ బచ్చన్ అందరికి స్పూర్తి కాగా, ఆయన తరహాలోనే రజనీకాంత్, పవన్ కల్యాణ్, మహేష్, విజయ్ లాంటి పెద్ద స్టార్లు సమయానికి పన్ను చెల్లిస్తూ . ఇక అమితాబ్ గత ఆరు దశాబ్ధాలుగా నటిస్తూనే ఉన్నారు. అమితాబ్ ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారు.అమితాబ్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.