‘సవాళ్లతో కూడుకున్న పాత్రలు అరుదుగా దొరుకుతుంటాయి. నటుడి ఆకలి తీరేది అలాంటి పాత్రలు పోషించినప్పుడే’ అన్నారు బిగ్‌బీ అమితాబ్. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధువులు బిగ్‌బీకి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. వీరిలో ‘కల్కీ’ చిత్ర యూనిట్ కూడా ఉన్నారు.
అమితాబ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘కల్కీ’లో ఆయన లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఆ లుక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పోస్టర్ని తన వ్యక్తిగత సోషల్‌మీడియాలో పొందుపరిచి, ఓ కామెంట్ కూడా షేర్ చేశారు బిగ్‌బీ ‘సినిమా రంగం విశ్వం లాంటిది. అడుగడుగునా ఒడిదొడుకులే, ఎత్తుపల్లాలే. వాటన్నింటినీ సమర్థవంతంగా దాటి వెళ్లాలి. ఇక్కడ విజయం సమిష్టికృషి వల్లే సాధ్యం. ఎన్నో రకాల ఊహలకు, ఆలోచనలకూ రూపమే సినిమా’ అని పోస్ట్ చేశారు బిగ్‌బీ అమితాబ్.