బాలీవుడ్ లెజెండ్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాల విశేషాలను పంచుకుంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తుంటారు. సోమవారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్)లో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించారాయన. ఇందులో ఓ అభిమాని వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నకు అమితాబ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సెషన్లో ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు అమితాబ్.
‘మీరు సుదీర్ఘ కాలం జీవించాలంటే మీ గాడ్జెట్స్‌ను బ్రేక్ చేయండి’ అని సూచించారు. ఇది చూసిన ఓ నెటిజన్ ‘మీరు టైంకు నిద్రపోండి. లేకపోతే ఎక్కువకాలం జీవించలేరు’ అని కామెంట్ చేశారు. ఆ వ్యక్తికి అంతే వ్యంగ్యంగా రిైప్లె ఇచ్చారు బిగ్‌బీ. ‘నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు..అంతా ఈశ్వరుని దయ’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం ఉత్తమ జీవన మార్గాలను ఉదహరిస్తూ అమితాబ్‌బచ్చన్ వరుస పోస్ట్‌లు పెట్టారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘కల్కి-2’లో నటిస్తున్నారు.