Amir Khan Comments | దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ సినిమా పేరే. గతవారం రోజుల నుంచి ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్నిహొత్రీ దర్శకత్వం వహించాడు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజుతో పోలిస్తే 10వ రోజు ఏకంగా 9రెట్ల కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ చిత్రాన్ని సౌత్‌లోని అన్ని ముఖ్యమైన భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైయ్యాయట. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ స్పందించాడు.
‘1990లలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులు విచారకరమని. అప్పటి ఘటనలే ఆధారంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలను ప్రతి భారతీయుడు చూడాలని వెల్లడించాడు. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం భావోద్వేగానికి గురి చేస్తుందని చెప్పాడు. ప్రస్తుతం అమీర్‌ఖాన్ వర్క్‌లో బిజీగా ఉండి ఈ చిత్రాన్ని చూడలేకపోయానని త్వరలోనే చూస్తానని చెప్పాడు. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? ఎలా చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా తెరకెక్కించాడు. తాజాగానే ఈ చిత్రం 150కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఎలాంటి అంచనాల్లేకుండా 25.5 కోట్లతో బ్రేక్ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా దాదాపు 167 కోట్ల కలెక్షన్లను సాధించింది. కేవలం పదిరోజుల్లోనే ఈ చిత్రం నిర్మాతలకు 6 రెట్లు లాభాలను అందించింది.