Vijay Varma | మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah)తో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) మరో నటితో ప్రేమలో పడ్డట్లు తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh)తో విజయ్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది (Dating Rumours). ఇటీవలే వీరిద్దరూ ముంబైలో ఓ కేఫ్ దగ్గర ఎంతో క్లోజ్‌గా కనిపించడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ రూమర్స్‌కు బలంచేకూరుస్తూ ఇద్దరూ ఓ పార్టీలో మెరవడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా (Manish Malhotra) తన ఇంట్లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇటీవలే దివాళి పార్టీ (Diwali bash) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి పలువురు బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి విజయ్ వర్మ-ఫాతిమా సనా షేక్ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఫాతిమా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె షేర్ చేసిన ప్రతి ఫొటోలోనూ వీరిద్దరూ చాలా క్లోజ్‌గా కనిపించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి నెట్టింట షికారు చేస్తోంది.
తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గత రెండేళ్లుగా రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్ సమయంలో వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ కలిసి తిరిగారు. పార్టీలు, ఈవెంట్స్‌కు ఇద్దరూ కలిసే వెళ్లేవాళ్లు. తమ లవ్‌ఎఫైర్ గురించి అనేక సందర్భాల్లో ఈ జంట మాట్లాడారు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే మనస్పర్థల కారణంగా వీరు తమ బంధానికి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు.
ఇక ఫాతిమా సనా షేక్‌కి ‘దంగల్’ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’, ‘థార్’, ‘సామ్ బహదూర్’ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం విజయ్ – ఫాతిమా కలిసి ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్ర నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Keerthy Suresh | నేను భయపడ్డా కానీ ఊహించినంత ఏం జరుగలేదు.. పెళ్లిపై కీర్తిసురేశ్