“అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమా చూశాను. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్. సుహాస్ ఎప్పటిలాగే చాలా బాగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు హీరో విజయ్ దేవరకొండ. సుహాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. శివాని కథానాయిక.
దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. వెంకటేశ్ మహాన్, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం బిగ్ టికెట్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఏ సినిమాకైనా ఫస్టాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను, ఈ సినిమాను కంటిన్యూగా చూశాను. అంత క్యూరియస్‌గా అనిపించింది. శరణ్య అద్భుతంగా నటించింది. ఇదొక స్పెషల్ ఫిల్మ్. తప్పకుండా విజయం సాధిస్తుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు విజయ్ దేవరకొండ.