బిగ్‌బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం ప్రారంభమైంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేంద్రనాధ్ కూండ్ల నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్‌నివ్వగా, ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్ చేశారు. భారతీయ సినిమాలో ఎవరూ టచ్ చేయని వినూత్నమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపారు. రాజా రవీంద్ర, రూపాలక్ష్మి, వినోద్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి, సంగీతం: దాస్ కడియాల, మాటలు: మరుధూరి రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మల్యాద్రి రెడ్డి.