అల్లు శిరీష్ హీరోగా రూపొందిన ‘బడ్డీ’ సినిమా ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్‌సింగ్ కథానాయికలు. శామ్ ఆంటోన్ దర్శకుడు. స్టూడియోగ్రీన్ ఫిల్మ్స్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా , ఆధన జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలావుంటే.. ఈ చిత్రం టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు.
సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ 99 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 125 రూపాయలు మాత్రమే టికెట్స్ ఉంటాయని వారు చెప్పారు. మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయడానికే ఈ ప్రయత్నమని నిర్మాతలు తెలిపారు. అజ్మల్ అమీర్, ముఖేష్‌కుమార్, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హిప్ హాప్ తమిళ.