అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తి కానున్నదని సమాచారం. మరి ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు? అనేది ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొంతమంది దర్శకులతో బన్నీ సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఆ వరుసలో బోయపాటి శ్రీను ముందున్నట్టు తెలిసింది. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించేది బోయపాటి దర్శకత్వంలోనే అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సరైనోడు’ సినిమా వచ్చింది. అప్పటివరకూ బన్నీ కెరీర్లో అదే పెద్ద హిట్. ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పట్లో టాక్ నడిచింది. కానీ బన్నీ, బోయపాటి ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రస్తుతం బోయపాటి ‘అఖండ 2’ వచ్చే నెలలో వచ్చేస్తున్నది. ఆ సినిమా తర్వాత ఆయన బన్నీ కథపైనే కసరత్తులు మొదలుపెడతారట. ఈలోపు అట్లీ సినిమా పూర్తి చేసి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమా షూట్‌లోకి బన్నీ ఎంట్రీ ఇస్తారని అంతరంగిక వర్గాల సమాచారం.