అమరావతి : పుష్ప-2 సినిమా విడుదలై విజయవంతంగా పరుగులు పెడుతుండడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప-2( Puspa-2) ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందించిన చిత్రంలో రష్మిక, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సినిమా చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి విడుదల వరకు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, డైలాగులు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12వేల స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడం రికార్డు.
పుష్ప-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇచ్చాయి. మల్టిఫ్లెక్స్ థియేటర్లకు భారీగా ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతిలివ్వడం పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సినిమా నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అయితే అల్లు అర్జున్‌కు వరుసకు మామ అయిన ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ ఏపీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పుష్ప -2 సినిమాకు ధరల పెంపునకు సహకరించినందుకు గాను అల్లు అర్జున్ శనివారం రాత్రి స్పందించారు. ధరల పెంపునకు సహకరించినందుకు మామ పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.