Allu Arjun | నేడు టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గురువుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఒక పోస్ట్ చేస్తూ, “నా గురుజీ రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! నా మొదటి దర్శకుడు. నన్ను సినిమాల్లోకి పరిచయం చేసిన వ్యక్తి. ఈ జీవితాంతం రుణపడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న ఫోటోను కూడా అల్లు అర్జున్ పంచుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ను 2003లో విడుదలైన ‘గంగోత్రి’ సినిమాతో రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి, అల్లు అర్జున్ సినీ కెరీర్‌కు బలమైన పునాది వేసింది. తన తొలి చిత్రాన్ని తెరకెక్కించి, తనను హీరోగా నిలబెట్టినందుకు రాఘవేంద్రరావుపై అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంటారు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు మరోసారి వారి మధ్య ఉన్న గురు-శిష్య బంధాన్ని స్పష్టం చేశాయి.
Wishing a very Happy Birthday to my guru ji @Ragavendraraoba garu ! My first director . The man who launched me into films . Gratitude forever 🖤 pic.twitter.com/HdDXlzpj1Y
— Allu Arjun (@alluarjun) May 23, 2025