Allu Arjun | పుష్ప2 చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లకి సైన్ చేశాడు. త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్, అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే కెరీర్ పరంగా బన్నీ మంచి ఫామ్‌లోనే ఉన్నా కూడా పర్సనల్‌గా కొన్ని విషయాలు బన్నీని తీవ్ర ఇబ్బందులకి గురి చేశాయి. ముఖ్యంగా పుష్ప2 చిత్రం తర్వాత తాను జైలుకి వెళ్లడం ఇబ్బందిగా మారింది. తాను తప్పు చేయకపోయిన కూడా బన్నీ జైలుకి వెళ్లడం వలన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే ప్రస్తుతం బన్నీ తన కెరియర్‌పైనే ఫోకస్ చేశాడు.
అయితే తాజా పరిణామాలని దృష్టిలో పెట్టుకొని బన్నీ తన పేరుని మార్చుకోబోతున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ లో న్యూమరాలజీ ప్రకారం 2 “U” లను రెండు “N” లను యాడ్ చేస్తే చాలా బాగుంటుందట. న్యూమరాలజీ స్పెషలిస్ట్ సూచనల మేరకు బన్నీ ఆయన పేరులో ఎక్స్ట్రా “U” ఎక్స్ట్రా “N” జోడించబోతున్నారట . ఈ ప్రకారం అల్లు అర్జున్ కి బాగా కలిసి వస్తుంది అని .. ఇండియన్ హిస్టరీ లోనే నెంబర్ వన్ హీరోగా ఆయన పేరు మారుమోగిపోవడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక బన్నీ త్వరలో త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ అని తెలుస్తుంది. మైథాలజీ సబ్జెక్ట్‌తో ఈ సినిమా ఉండనుండగా, ఇది ఇతిహాసాల్లో ఎవరికీ తెలియని కొత్త కథ. ఎవ్వరూ చూడని కొత్త పాత్రలో బన్నీ కనిపిస్తారు అని తెలుస్తుంది.. పాన్ ఇండియా స్థాయిలో వందలకోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా ఉంటుంది. దీనికి ప్రీప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ సమయం అవసరం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలోనే ఉన్నారు అని ఇటీవల నాగవంశీ తెలిపాడు. ఇక అల్లు అర్జున్ కొన్ని రోజులుగా అట్లీ ప్రాజెక్ట్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 5గురు హీరోయిన్లు ఉంటారని.. జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ అని తెలుస్తుంది.