Allu Arjun | ‘పుష్ప-2’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం సోషియో, మైథలాజికల్ జానర్లో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
హిందూ ధర్మంలో యుద్ధం, విజయానికి ప్రతీకలా భావించే శివుడి తనయుడు కార్తికేయుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని చెబుతున్నారు. భారతీయ పురాణాలను నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా ప్రచారం అవుతున్నది.
అయితే ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చరుగ్గా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో సినిమాను సెట్స్‌మీదకు తీసుకొస్తారని సమాచారం.