Allu Arjun | ‘పుష్ప-2’తో బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ చెడుగుడు ఆడేశాడు బన్నీ. త్రివిక్రమ్‌తో చేయబోయే ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది మిడిల్లో ఈ సినిమా మొదలు కానున్నదని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత మరో సినిమాను కూడా ఓకే చేసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ.. బన్నీని కలిసి ఓ కథ వినిపించారని విశ్వసనీయ సమాచారం.
త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అంటున్నారు. ఇక కొరటాలకు ‘దేవర-2’ ఉండనే ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే ఈ నయా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం. మరి బన్నీ కోసం కొరటాల ఎలాంటి కథను తయారు చేశారో, ఈ సినిమా నిర్మించేదెవరో.. తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.