Pushpa 2 The Rule | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). రేంజ్ ఇంటర్నేషనల్ వరకు వెళ్లింది. తాజాగా ఈ సినిమాలోని వచ్చుండాయి ఫీలింగ్స్ పాటకు నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్లో డ్యాన్స్ చేశారు.
నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అనేది నార్త్ అమెరికాలో ఉన్న ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్. ఇందులో 30 జట్లు ఉంటాయి. ప్రపంచంలోని ప్రధాన ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్లలో నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ టోర్నికి సంబంధించి ఒక మ్యాచ్కి ముందు చీర్ గర్ల్స్ పుష్ప 2లోని వచ్చుండాయి ఫీలింగ్స్ పాటకు డ్యాన్స్ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ వరకు వెళ్లిందని కామెంట్లు పెడుతున్నారు.
Peelings at @NBA 🇮🇳🔥
Global reach of Pushpa is crazy 🔥 pic.twitter.com/lB3RnRTfxm
— GANESH_07 (@GaneshPagadala2) February 27, 2025