PM Modi | జీవితంలో ఏదీ సులువుగా ఉండదు.. పరీక్షా పే చర్చలో విద్యార్థులతో మోదీ
PM Modi | సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునే పరిస్థితికి వెళ్లొద్దని సూచించారు.
PM Modi : సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునే పరిస్థితికి వెళ్లొద్దని సూచించారు. ‘పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha)’ రెండో ఎడిషన్‌లో భాగంగా పలువురు విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.
ఈ సందర్భంగా కెరీర్ పురోగతికి సంబంధించి వారికి విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు వెలిబుచ్చిన సందేహాలకు సమధానాలు ఇచ్చారు. క్రమశిక్షణ, ప్రేరణ ఈ రెండింటిలో ఏది ముఖ్యం..? అన్న ప్రశ్నకు.. ఆ రెండింటినీ పోల్చకూడదని అన్నారు. ఎంత స్ఫూర్తి పొందినా ఆచరణలో క్రమశిక్షణ లేకపోతే సత్ఫలితాలు పొందలేరని అన్నారు. సమయపాలన, స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణే మన ప్రేరణను అర్థవంతమైన ఫలితాలుగా మారుస్తుందని చెప్పారు.
ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయాలు నిజమేనా..? అన్న ప్రశ్నకు సాంకేతికత మన పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఏఐకి విద్యార్థులు భయపడాల్సిన పనిలేదన్నారు. టెక్నాలజీతో ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. జీవితంలో ఏదీ సులువుగా ఉండదన్నారు.
విద్యార్థులకు ఐదు ట్రావెల్ డెస్టినేషన్స్ చెప్పండి..? అని అడుగగా.. ముందు మన సొంత ప్రాంతాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. మన జిల్లా, నగరం, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాల జాబితాను రాసుకోవాలన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో ఎంచుకోవాలని చెప్పారు. అనంతరం మన సమీపంలో ఉన్న ప్రాంతాల విశిష్టతను తెలుసుకుంటే, అది భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
మంచి నాయకుడిగా ఎలా మారాలి..? అన్న ప్రశ్నకు మన విధివిధానాలకు ఎన్నటికీ భయపడకూడదని చెప్పారు. విధేయత, నిబద్ధతతో పనిచేయాలన్నారు. నిలకడగా సరైన పని చేయడమే నిజమైన నాయకత్వమని చెప్పారు. లీడర్‌షిప్‌నకు ముఖ్యమైన లక్షణం మీ ఆలోచనలను కనీసం 10 మందికైనా స్పష్టంగా తెలియజేయగలడమని అన్నారు.
మెదడు ఆరోగ్యంగా పనిచేయాలంటే కంటినిండా నిద్రపోవాలని ప్రధాని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితాన్ని కూడా ఆస్వాదించాలని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంగా ఉండటం చాలా ముఖ్యమని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ప్రధాని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

