అగ్ని.. విశ్వం త్యాగం వెరసి రాకా
‘పుష్ప’ ఫ్రాంచైజీతో పానిండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్ పిక్చర్స్‌వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘పుష్ప’ ఫ్రాంచైజీతో పానిండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్ పిక్చర్స్‌వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు అట్లీ తనదైన శైలి మాస్ ఎలిమెంట్స్‌కు ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి ఈ కథను తయారు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో గ్లింప్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రాకా ప్రపంచాన్ని, దాని విజువల్ స్కేల్‌ని ఈ గ్లింప్స్ ద్వారా పరిచయం చేయనున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ‘రాకా’ కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. మూడు కాలాల్లో నడిచే ఈ కథలో అల్లు అర్జున్ మూడు రకాల భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ‘అగ్ని.. విశ్వం.. త్యాగం..’ ఈ మూడింటి చుట్టూనే ఈ సినిమా కాన్సెప్ట్ నడుస్తుందని తెలిసింది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కీ రోల్ పోషించే ఈ చిత్రంలో దీపిక పదుకోణ్ కథానాయిక కాగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

