Pushpa 2 The Rule | సౌత్‌తోపాటు నార్తిండియన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) థియేటర్లలోకి రానే వచ్చింది. అంతా ఊహించినట్టుగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. పుష్పరాజ్‌గా ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun) వన్ మ్యాన్ షోలా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై
పుష్ప 2 ది రూల్ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలతో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతుండగా.. అభిమానులు, మూవీ లవర్స్ డిమాండ్ మేరకు మరిన్ని షోలు యాడ్ చేశారు మేకర్స్. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..? ప్రధాన నగరాలైన ముంబై, థానే, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా మిడ్నైట్ షోలు (11.55 pm / 11.59 pm)ను యాడ్ చేశారని బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ షోల బుకింగ్స్ మొదలుపెట్టిన నిమిషాల్లోనే టికెట్స్ అమ్ముడుపోయాయట.
పుష్పరాజ్ మేనియా నార్త్‌లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు రాబడుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?