Pushpa 2 The Rule| టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప 2 ది రూల్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
కాగా నెట్‌ఫ్లిక్స్ ను కూడా రూల్ చేస్తున్నాడు పుష్పరాజ్. ఎక్స్ బయో కేటగిరీలో ఈ పేజీ పుష్ప రూల్‌లో ఉంది..అంటూ క్యాప్షన్ పెట్టింది నెట్‌ఫ్లిక్స్ ఇండియా. థియేటర్లలో అయినా.. నెట్‌ఫ్లిక్స్‌లో అయినా అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ క్రేజ్ రైజింగ్ అండ్ రూలింగ్.. అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
ఈ మూవీ ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులు సాధించిన భారతీయ సినిమాలుగా నిలిచిన బాహుబలి 2 ( రూ.1810 కోట్లు), దంగల్ (సుమారు రూ.2200 కోట్లు) రికార్డులు బీచ్ చేసి రూ.2200 కోట్లకుపైగా వసూళ్లు చేసి గ్లోబల్ బాక్సాఫీస్ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టేసింది. పుష్ప 2 ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన భారతీయ సినిమాగా చెరగని ఫీట్ నమోదు చేసింది.
ఈ మూవీలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్, షణ్ముఖ్, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, సామ్ సిఎస్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
NETFLIX INDIA [official Instagram handle of @NetflixIndia] updated it’s bio with the caption “THIS PAGE IS UNDER PUSHPA’s RULE 🔥”.
Be it theatre .. Be it Netflix 📌 #AlluArjun & #Pushpa2TheRule crAAze is rising & ruling 👌💥💥💥💥 pic.twitter.com/FK5F8Nw1Pi
— Movies4u Official (@Movies4u_Officl) January 30, 2025
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్