Pushpa 2 | చిత్తూరు జిల్లా కుప్పంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. పుష్ప 2 చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో ఓ స్థానిక నేతకు చెందిన లక్ష్మీ, మహాలక్ష్మీ థియేటర్లలో పుష్ప 2 చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ రెండు థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా, ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చారు. అర్ధాంతరంగా సినిమాను నిలిపివేసి మరీ థియేటర్‌కు తాళాలు వేశారు. దీంతో వీకెండ్లో సినిమా చూడాలని ఎంతో ఆశగా వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా థియేటర్లో సినిమాలు ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నప్పటికీ.. దీనివెనుక కక్ష సాధింపు ఉన్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చంద్రబాబు ఇలాకాలో ‘పుష్ప-2’ థియేటర్లు సీజ్!
కుప్పంలో పుష్ప సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.
సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, NOC సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శనలు చేస్తున్నారంటూ నోటీసులిచ్చారు.#Kuppam… pic.twitter.com/BVLb4m7kMR
— greatandhra (@greatandhranews) December 7, 2024
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవికి మద్దతు పలకడం పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. సొంత ఫ్యామిలీకి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి కాకుండా ప్రత్యర్థులకు ప్రచారం చేయడమేంటని అల్లు అర్జున్‌పై పలువురు కక్ష కట్టారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాపై కావాల్సినంత నెగిటివ్ ప్రచారం చేయాలని చూశారు. కానీ డిసెంబర్ 5వ తేదీన విడుదలైన పుష్ప 2 చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే బన్నీకి వస్తున్న క్రేజ్ చూసి ఓర్వలేకనే ఇలా టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అభిమానులు భావిస్తున్నారు.