Allu Arjun praises RRR Team | దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ విధ్వంసం సృష్టిస్తుంది. ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తారక్, చరణ్‌ల నటనకు ఫిదా అయిపోతున్నారు. రాజమౌళి టేకింగ్‌కు ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా పలువురు సినీతారలు ఈ చిత్రాన్ని వీక్షించి నటినటులు, సాంకేతిక నిపులణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శంకర్, ప్రశాంత్ నీల్, సుకుమార్‌లు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లుఅర్జున్ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందాన్ని అభినందించాడు.
‘ఇంత గొప్ప సినిమాని మాకు అందించినందుకు రాజమౌళి గారికి స్పెషల్ థాంక్స్. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మా బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అలాగే కీలక పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ కూడా బాగా చేశారు. కీరవాణి, సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్యతో పాటు మిగతా నటీనటులకు టెక్నీషియన్లు అందరికీ అభినందనలు. ఇండియా గర్వించదగ్గ సినిమాగా ట్రిపుల్ఆర్ను తెరకెక్కించినందుకు అందరికి ధన్యవాదాలు’ అంటూ బన్నీ చిత్రబృందాన్ని ప్రశంసించాడు.
బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రిస్లు కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మించాడు.
@tarak9999 for a spectacular show. Brilliant Presence by respected @ajaydevgn Garu & our sweetest @aliaa08 . And my spl wishes to @mmkeeravaani garu, @DOPSenthilKumar garu, Dvv Danayya garu & many others. Thank you all for making INDIAN CINEMA proud. This is a Kille R R R !
— Allu Arjun (@alluarjun) March 26, 2022
Read also:
RRR Collections | బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ విధ్వంసం.. ‘బాహుబలి’ రికార్డులు అవుట్
Nithiin | మాస్ అవతారంలో నితిన్.. ఆకట్టుకుంటున్న ‘మాచర్లనియోజకవర్గం’ ఫస్ట్‌లుక్
Vikram Movie | కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలో.. బిగ్ బీ అమితాబ్?
Vikramarkudu | ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌కు నో చెప్పిన రాజమౌళి?