Nithiin | హిట్లు ఫ్లాపులతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూ ఉంటాడు యూత్ స్టార్ నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ కథతో రానున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా నితిన్ ఫస్ట్‌లుక్(ఫస్ట్ ఛార్జ్) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్లో నితిన్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నితిన్ వెనకాల పులి గెటప్‌లతో విలన్లు తన మీద కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పోస్టర్‌ను గమనిస్తూ ఎదో ఫైటింగ్ సన్నివేశంలా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నితిన్ తన సోషల్ మీడియాలో ‘మీకు నచ్చే, మీరు మెచ్చే, మాస్‌తో వస్తున్నా రిపోర్టింగ్ సిద్ధార్థ్ రెడ్డి’ అంటూ పోస్టర్‌ను షేర్ చేశాడు. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటించనున్నాడు.నితిన్‌కు జోడిగా కృతీశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.