Allu Arjun | యువ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రన్ అవుతోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.130 కోట్లు కలెక్ట్ చేసి, రూ.140 కోట్లు దిశగా దూసుకెళ్తోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్, గ్రాఫిక్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా టీంకు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. మిరాయ్ టీంకు అభినందనలు!ఈ సినిమా అద్భుతంగా ఉంది. తేజ సజ్జా నీ కష్టానికి, డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.ఇలాంటి సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు అని అన్నారు.
అలానే మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు పాత్రలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. సీజీ వర్క్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ మిక్సింగ్, గౌర హరి సంగీతం వంటి టెక్నికల్ అంశాలన్నీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి అంటూ చెప్పిన బన్నీ ..దర్శకుడు కార్తిక్ గట్టమనేనిని ‘న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్’ గా అభివర్ణించారు. అలాగే నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు తెలిపారు. తేజ సజ్జా, ఇంతవరకు చేసిన సినిమాల్లో ఇదే అతిపెద్ద హిట్‌గా నిలిచే సూచనలు ఉన్నాయి.
మిరాయ్ ద్వారా తేజ తనలోని యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు భిన్నకోణాలని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆయన డెడికేషన్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తిక్ ఘట్టమనేని తొలిసారి డైరెక్షన్లో అడుగుపెట్టి, సినిమాటోగ్రఫీతోపాటు కథనాన్ని సైతం చాలా చక్కగా నడిపించాడు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, కల్చరల్ ఎమోషన్స్‌ను మిక్స్ చేసి తీయడం అతని టాలెంట్‌కి నిదర్శనం. ‘మిరాయ్’ భారీ కలెక్షన్లు సాధించడమే కాకుండా, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో మెచ్చిన సినిమా కావడం, టీంకు ప్రోత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ విజయం తేజ సజ్జా కెరీర్‌కు మైలురాయిగా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.