Allu Arjun | అమెరికాలోని టంపా నగరంలో NATS (North America Telugu Society) 2025 వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగువారంతా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొనడంతో ఈ వేడుక మరింత అట్రాక్షన్‌గా మారింది. ఆయన రాకతో అక్కడి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విదేశాల్లో నివసించే తెలుగు కుటుంబాలకు NATSలో అల్లు అర్జున్ను చూడటం అంటే ఒక నటుడిని కలవడం కాదు. వారి మూలాలు, వారి భాష, వారి సంస్కృతితో తిరిగి కనెక్ట్ అయిన ఫీలింగ్ కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ ఒక సినిమా నటుడికంటే ఎక్కువ.ఆయన ఒక ఎమోషన్..ఒక బ్రాండ్… ఒక స్ఫూర్తి.
NATS 2025 ఒక కళా కార్యక్రమం మాదిరిగా కాకుండా, తెలుగు వారి ఐక్యతకు ప్రతీకగా, సంస్కృతి పరిరక్షణకు వేదికగా మారింది. ఇక వేదికపైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్, తన మార్క్ డైలాగులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు ‘‘ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే..! అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..!’’, ‘‘తెలుగోళ్లంటే ఫైర్ అనుకున్నారా..? వైల్డ్ ఫైర్..!’’, ఈ డైలాగ్స్‌తో ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులకి పూనకాలు వచ్చేశాయి. ఇక ఇక బన్నీ తనదైన స్టైల్లో యాంకర్ శ్రీముఖిపై కూడా ప్రశంసలు కురిపించాడు. ‘మీ యాంకరింగ్ మాత్రం రప్పా రప్పా!’’ అంటూ ఆమెను బాగా పొగిడాడు. ఈ మాటలతో శ్రీముఖి ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఇందులో కథానాయికగా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారు రూ. 800 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది . ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.