Allu Arjun| స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ క్రేజ్‌ని ఎల్లలు దాటేలా చేసింది. అంతేకాదు పుష్ప సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక రీసెంట్గా పుష్ప2 చిత్రంతో పలకరించగా, ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఏదేమైన పుష్ప ఫ్రాంచైజీతో అల్లు వారబ్బాయి అందరివాడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమాల గురించి చర్చ జోరుగా నడుస్తుంది. పలువురు దర్శకుడు క్యూలో ఉండగా,ముందుగా ఏ డైరెక్టర్‌తో చేస్తాడా అని అందరి ముచ్చటించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ విషయంలో ఏ మాత్రం తొందరపడడం లేదు.
పుష్ప కోసం అనుకోకుండా ఐదేళ్లు తీసుకున్నానని.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు కాకపోయినా కనీసం ఒక్కటైనా చేస్తానంటూ ఆ మధ్య అభిమానులకు బన్నీ ప్రామిస్ చేశారు. అయితే ఆయనకి ఇప్పుడు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాస్త కష్టమే. మొన్నటి వరకు త్రివిక్రమ్‌తో సినిమా అన్నారు. సడన్‌గా రేసులోకి అట్లీ వచ్చారు. త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని నాగవంశీ కూడా ఆ మధ్య హింట్ ఇచ్చారు. దాదాపు అట్లీ, బన్నీ కాంబో ఫిక్సైపోయినట్లే. అట్లీ ప్రస్తుతం తన టీంతో అల్లు అర్జున్ కోసం స్టోరీ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకి ఏ రేంజ్లో పెరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం.ఆయనకి ఆర్మీ కూడా ఉంది. కొందరు అభిమానులు బన్నీని ఎక్కడికో తీసుకెళ్లాలని పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా వంద రూపాయలు నోటుపై బన్నీ ముఖ చిత్రం ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గాంధీ తాతని బదులు పుష్పరాజ్ ని పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్. కాని దీనిని కొందరు తప్పు పడుతున్నారు. మీ పిచ్చి పీక్స్ కి వెళ్లిందిగా అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా పుష్ప తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నలుమూలలా వ్యాపించేసింది.