Allu arjun | గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ పలు వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వైసీపీ ఎమ్మెల్యే కోసం బన్నీ ప్రచారంలో దిగడంతో ఆయన మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడనే టాక్ ఉంది. అయితే బన్నీ తాజాగా ముంబై వేదికగా నాలుగు రోజులపాటు జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) లో చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రత్యేక చిట్ చాట్‌లో బన్నీ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనక కారణం చిరంజీవి ఉన్నారని తెలిపారు. నటుడిగా నేను మారడానికి కారణం చిరంజీవి అని, ఆయన తనని ఎంతో ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు. `మెగా` వివాదం వేళ బన్నీ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారాయి.
ఇక డ్యాన్స్ గురించి కూడా మాట్లాడిన బన్నీ తనకి డ్యాన్స్ అనేది స్వతహాగా వచ్చింది. ఎవరి దగ్గర ట్రైన్ తీసుకోలేదు. సెల్ఫ్ గానే తాను మంచి డాన్సర్‌ని అని, ఆ తర్వాత ట్రైనర్స్ సహాయంతో ఇంకా బాగా మౌల్డ్ అయినట్టు చెప్పుకొచ్చాడు.ఇక 10వ సినిమా షూటింగ్ తర్వాత తనకు యాక్సిడెంట్ జరిగిందని, అప్పుడు తన భుజానికి గాయం కావడంతో చిన్న సర్జరీ చేయడంతో, మూడు వారాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత జిమ్ కు వెళ్లాను అని చెప్పుకొచ్చారు. ఇక తన జీవితంలోని స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ, తన 18వ సినిమా ఫ్లాప్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డట్టు చెప్పుకొచ్చారు.
తన గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారని, ఇకపై తాను చేసే సినిమా అందరు మాట్లాడుకునేలా ఉండాలని భావించి చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో బన్నీ `అల వైకుంఠపురములో` సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక అట్లీ సినిమా గురించి చెబుతూ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ చిత్రం ఉంటుదని తెలియజేశారు. ఇండియన్ మూవీస్‌లోనే ఇలాంటి మూవీ రాలేదు. ఒక గొప్ప సినిమాని చూడబోతున్నారని తెలియజేస్తూ మూవీపై మరింత ఆసక్తి పెంచాడు. ఏది ఏమైన బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.