Allu Arjun | గత రాత్రి జరిగిన గద్ధర్ ఫిల్మ్ అవార్డ్ వేడుకలో అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న బన్నీ ఈ అద్బుతానికి కారణమైన దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డు రావడం పూర్తిగా మీ విజన్ వల్లే సాధ్యమైంది. అలాగే నా నిర్మాతలు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లకి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. అలానే రాజమౌళిగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఆ రోజు `పుష్ప` చిత్రాన్ని హిందీ రిలీజ్ చేయమని చెప్పకపోతే ఇంతటి విజయం వచ్చేది కాదని బన్నీ అన్నారు.
మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా. `పుష్ప 2` సినిమా గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ పురస్కారాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి, అదే సమయంలో మిమ్మల్నిఎప్పుడూ గర్వపడేలా చేస్తాను అంటూ బన్నీ చెప్పుకొచ్చారు. ఇక ఆ క్రమంలోనే `పుష్ప2` సినిమాలోని డైలాగ్‌ని స్టేజ్‌పై చెప్పి ఆశ్చర్యపరిచారు. `ఆ బిడ్డమీద ఒక్క గీటు పడ్డ గంగమ్మ జాతరలో యాట తలనరికినట్టు రఫ్ఫా రఫ్ఫా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప, పుష్పరాజ్ అస్సలు తగ్గేదెలే` అంటూ మాస్ డైలాగ్ చెప్పి అందరిని అలరించారు. బన్నీ డైలాగ్‌కి స్టేజ్ మీద ఉన్న వారితో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు.
ఇక పుష్ప2తో చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రమే చేస్తున్నాడు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని అట్లీ అన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, బడ్జెట్‌పై ఇంకా స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందని పేర్కొన్నారు. ఇక చిత్ర విడుదల తేదీని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయిస్తారని అట్లీ తెలిపారు.