అల్లు అర్జున్ మరో క్రేజీ మూవీకి శ్రీకారం చుట్టారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ బాలీవుడ్లో నేరుగా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయనకు పుష్ప సినిమా ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల అభిమానం దక్కింది. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి కాంబినేషన్ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.