అల్లు అర్జున్‌కి బాధ్యత పెరిగింది. జాతీయ ఉత్తమనటుడయ్యాడు కదా.. జాగ్రత్తగా అడుగులేయాలనుకుంటున్నాడేమో.. తాను చేయబోయే త్రివిక్రమ్ సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.. బన్నీ, త్రివిక్రమ్ కలయికలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించబోతున్న విషయం తెలిసిందే.. పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.. కథా పరంగా ఇందులో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందట. అది సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం..
భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో సినిమాలు సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.. దాంతో వీరి కలయికలో వస్తున్న ఈ నాలుగో సినిమాపై భారీ అంచనాలున్నాయ్. ‘పుష్ప- 2’ షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే ఈ సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.